గుంటూరు జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలతో ఇద్దరు రోగులు ఆసుపత్రిలో చేరారు. నగర శివార్లలోని ఐడీ ఆసుపత్రిలో వారిని ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక మహిళ నేపాల్‌కు తీర్థయాత్రలకు వెళ్లిరాగా... మరో యువతి... నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఆమె స్వదేశం చైనాకు ఇటీవలే వెళ్లివచ్చింది. వీరిద్దరి నుంచి నమూనాలు సేకరించి తిరుపతి పంపించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి ఆరోఎంవో సునంద తెలిపారు. కోరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామంటోన్న సునందతో 'ఈటీవి భారత్' ముఖాముఖి.
ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...