గిరిజనులపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ గుంటూరులో గిరిజన సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. కరోనా రోగులకు చికిత్స చేయడానికి అన్నిరకాల వైద్య సదుపాయాలు లేవని అడిగిన గిరిజన వైద్యుడిని జిల్లా కలెక్టర్ ఇష్టానుసారంగా మాట్లాడడం దారుణమని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారునాయక్ అన్నారు.
గతంలో గిరిజనులపై దాడులు జరిగితే స్పందించని కలెక్టర్... కనీస వైద్య సదుపాయాలు లేవని అడిగితే మాత్రం ఆవేశపడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై దాడులు, మానభంగాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజనులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి