గుంటూరు నుంచి నరసరావు పేట వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు.. ఎండ కాలంలో ప్రయాణికులకు, పాదచారులకు నీడనిస్తూ.. ఆహ్లదాన్ని పంచుతుంటాయి. అలాంటి చెట్లపై సరైన నిఘా లేకపోవటంతో.. గుర్తు తెలియని ఆకతాయిలు.. చెట్టు తొర్రల్లో నిప్పు పెడుతున్నారు. దీంతో చెట్లు కాలి, కూలిపోతున్నాయి.
ఇలా చెట్టు కూలిన సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవటంతో.. పెను ప్రమాదం తప్పింది. అనంతరం కిలోమిటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోవటంతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. అధికారులు స్పందించి.. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: