సూర్యలంక బీచ్‌కు కొవిడ్ నేపథ్యంలో ఎనిమిది నెలలుగా పర్యాటకులను అనుమతించలేదు. కార్తీకమాసం ప్రారంభం కావడంతో అధికారులు నిబంధనతో పర్యాటకులను అనుమతిస్తున్నారు. మొదటి రోజే భక్తులు, పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా సముద్రస్నానాలు చేస్తూ కేరింతలు కొడుతూ సెల్ఫీలు దిగారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. పది సంవత్సరాల లోపు పిల్లలను 70 సంవత్సరాల వయసున్న వృద్ధులను తీరానికి అనుమతించటం లేదు. వాహనాలలో పరిమితంగానే పర్యాటకులు రావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఇదీ చదవండి: తగ్గిన పసిడి దిగుమతులు- దిగొచ్చిన వాణిజ్య లోటు