ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంగళగిరి బస్టాండ్ కూడలి వద్ద భిక్షాటన.. వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఏటా లక్ష ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేస్తానన్న ముఖ్యమంత్రి... కేవలం వేల సంఖ్యలో ఉద్యోగ ప్రకటన చేశారని, దీని వల్ల నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. వాలంటీర్లకు చాలీచాలని జీతాలు ఇచ్చి, వారిని జాబ్ క్యాలండర్‌లో చేర్చటం దుర్మార్గమైన చర్యగా చెప్పారు.
పోలీసు, విద్య, వైద్య, ఆర్ధిక శాఖల్లో ఖాళీగా ఉన్న 45,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయకపోతే 19వ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల యత్నం.. భగ్నం చేసిన పోలీసులు