ETV Bharat / state

'ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు..!' - తుళ్లూరు రైతులు ధర్నా

శాసనమండలి రద్దు చేస్తూ శాసనసభ తీసుకున్న నిర్ణయంపై తుళ్లూరు ప్రాంతానికి చెందిన రాజధాని రైతులు, మహిళలు భగ్గుమన్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్​ కమిటీకి పంపిచి తమకు బాసటగా నిలిచిన శాసనమండలి పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.

'ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు..!'

author img

By

Published : Jan 28, 2020, 8:49 AM IST

ప్రభుత్వంపై మహిళలు, రైతుల విమర్శలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ తుళ్లూరులో జరిగిన 41 రోజు మహా ధర్నాలో రైతులు, మహిళలు తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా, రైతు, రాజకీయ పక్షాలు రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి. కృష్ణా జిల్లా పెనమలూరు, గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కూరగాయల రైతులు.. రాజధాని రైతుల వంటా వార్పునకు మూడు లారీల కూరగాయలను అందజేశారు. తమను సంప్రదించకుండానే సీఆర్‌డీఏను రద్దు చేశారని.. ప్రస్తుతం కౌన్సిల్ విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారని రాజధాని రైతులు మండిపడ్డారు. శాసనమండలి రద్దైనప్పటికీ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉందని.. శాసనమండలి రద్దు కాకుండా.. కేంద్రం క్రీయాశీల పాత్ర పోషించాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని అణచివేతలు చర్యలు చేపట్టినా అమరావతి కోసం వివిధ రూపాల్లో తమ పోరాటం కొనసాగుతుందని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు: నక్కా ఆనంద్​బాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.