ETV Bharat / state

అద్దె ఇంట్లో 2 సార్లు దొంగతనం.. విచారణలో తేలిన మరో నిజం!

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. అలా అనుకున్నాడేమో.. ఓ వ్యక్తి తాను అద్దెకున్న ఇంట్లో... యాజమాని ఇంట్లోనే రెండు సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు.రూ. 21.50 లక్షలు అపహరించాడు. ఈ కథలో ఇంకో ట్విస్ట్..ఏంటంటే.. ఇంత సొమ్ము పోతే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఇంటి యజమాని 2 లక్షలే పోయిందని ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు తీగలాగితే డొంకంతా కదిలినట్లు నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి.

theft in guntur dst thenali by a tenanent in his owner house two times

author img

By

Published : Aug 11, 2020, 6:26 PM IST

దొంగతనం వివరాలు చెపుతున్న ఎస్పీ

అద్దెకు వచ్చి అదే ఇంటిలో రెండు సార్లు దొంగతననానికి పాల్పడిన నిందితుడిని గుంటూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. 21.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరపర్చినట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అదే ఇంటిలో నిందితుడు రెండు నెలల క్రితం 5.15 లక్షల నగదును దొంగతనం చేశాడని మరల నిన్న దొంగతనం చేశాడని వివరించారు.

నమ్మించి.. వంచించి...

గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో కౌతారపు నమ్మయ్య అనే కిరాణా వ్యాపారి ఇంటిలో నాయుడు తిరుపతయ్య అనే వ్యక్తి వ్యక్తి గత కొద్దిరోజులుగా అద్దెకు ఉంటున్నాడు. ఇంటి యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఇదే అదునుగా భావించి రెండు నెలల క్రితం 5.15లక్షలు చోరి చేసి పరారయ్యాడు. అప్పుడు నిందితుడ్ని అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటొకొచ్చిన వ్యక్తి మళ్లీ అదే ఇంట్లో తన చేతి వాటం చూపించాడు.

ఈనెల 10 న నమ్మయ్య ఇంటిలో దొంగతనం చేసి పరారయ్యాడు. దీనిపై నమ్మయ్య తెనాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి రేపల్లెలో నిందితుడు నాయుడు తిరుపతయ్యని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 21.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

తీగ లాగారు.. డొంక కదిలింది

theft in guntur dst thenali by a tenanent in his owner house two times
దొంగను అరెస్టు చేసి సొమ్ము చూపిస్తున్న పోలీసులు

అయితే ఇదాంతా బాగనే ఉంది..కానీ ఇంటి యజమాని మాత్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2లక్షలే పోయాయని చేయటం పోలీసులకు అనుమానం కలిగిస్తోంది. ఎందుకు తక్కువ మొత్తం ఫిర్యాదులో రాశాడు అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు అతను గుట్కా వ్యాపారం కూడా చేస్తాడనే సమాచారం అందింది. అక్రమ సొమ్ము కావటంతో తక్కువ మొత్తమే పోయిందని ఫిర్యాదు చేసినట్లు తేలింది.

ఇదీ చూడండి:

నాటు సారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.