దేశవ్యాప్తంగా మహిళలు, దళితులపై జరుగుతున్న హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా... నిరసనలు జరపాలని గుంటూరులో ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో మహిళలు, దళితులపై అత్యాచారాలు, దాడులు హింస నిత్యకృత్యమయ్యాయని వ్యాఖ్యానించారు. హత్రాస్ లో జరిగిన ఘటనే నిదర్శనం అన్నారు.
భాజపా నాయకులు ఘటన అనంతరం చేస్తున్న అసత్య ప్రకటనలు, వారి కుటుంబం పై వ్యక్తిగతంగా బురద జల్లడం చూస్తుంటే.... దోషులను రక్షించడానికి ప్రభుత్వం మరింతగా ప్రయత్నిస్తున్నట్టే ఉందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా 13వ తేదీన జరపనున్న కార్యక్రమాలలో అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: