వేమూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణం - వేమూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణం
అన్ని పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని... ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ ఛైర్మన్గా బొల్లిముంత ఏడుకొండలును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మెరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.