గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రహదారిపై లారీ అదుపుతప్పింది. మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు రాత్రి సమయం కావడం దుకాణాల్లో ఎవరూ లేకపోవడం ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్ గత కొద్ది రోజులుగా విరామం లేకుండా డ్యూటీ చేయడం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో జరిగినట్లు తెలియజేశారు.
ఇవీ చూడండి...