ETV Bharat / state

'ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పదోతరగతి పరీక్షలు' - ఏప్రిల్​లో పదో తరగతి పరీక్షల వార్తలు

రేపు అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నట్లు రాష్ట్ర కౌన్సిల్ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇంఛార్జ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, వట్టిచెరుకూరుల్లో పర్యటించారు. ఈ ఏడాది పదోతరగతి విద్యార్థులకు ఏప్రిల్ నెలలో చివరి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

pratap reddy
ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇంఛార్జ్ డైరెక్టర్
author img

By

Published : Nov 25, 2020, 7:49 PM IST

రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర కౌన్సిల్ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇంఛార్జ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో జడ్పీ ఉన్నత పాఠశాలలను.. డీఈవో గంగాభవానితో కలసి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు.

ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం జరపనున్నామని.. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరవుతారని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది సమ్మేటివ్ 1, 2 పరీక్షలు ఉండవని... నేరుగా ఏప్రిల్ నెలలో చివరి పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను త్వరలోనే అందిస్తామని ప్రతాప్ రెడ్డి చెప్పారు.

ఇవీ చదవండి.. '

మార్కాపురం కేంద్రంగా గిద్దలూరును ప్రత్యేక జిల్లాగా చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.