గుంటూరు జిల్లా వినుకొండ మండలం రామలింగాపురంలో పాత కక్షల కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఇంటి వద్ద స్థలంలో మట్టి పోసే విషయంలో.. గ్రామానికి చెందిన పంది పేరయ్య, దేవన బోయిన గురవయ్య వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.
పరస్పరం దాడుల వరకూ.. వాగ్వాదం వెళ్లింది. గురవయ్యతో పాటు కంది యోగయ్య, బాల గురవయ్య, వీరాంజంనేయులు తీవ్రగాయాలు కాగా.. మరో వర్గానికి చెందిన పంది పేరయ్య, పాపారావు, శేషయ్య , పేరమ్మలు గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గత మూడేళ్ల క్రితం గురవయ్య వర్గీయులు.. తమ గొర్రెల్ని దొంగిలించారని, విషయం బయటపడ్డాక పరిహారం చెల్లించారని పేరయ్య వర్గం చెప్పింది. అప్పటినుంచి తమపై కక్షగట్టి ఇప్పుడు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. మరోవైపు... ఇంటి దగ్గర మట్టి పోసే విషయమై ఉద్దేశపూర్వకంగానే తమపై దాడి చేశారని దేవన బోయిన గురవయ్య వర్గీయులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
Need Help: శివయ్యను కాపాడుకోవాలని తల్లి ఆవేదన.. సాయానికి ఎవరైనా ముందుకొచ్చేనా..?