ETV Bharat / state

సీఎం జగన్ బీసీలపై కక్షగట్టి వేధిస్తున్నారు.: చింతకాయల విజయ్‌

author img

By

Published : Jan 30, 2023, 9:00 PM IST

Chintakayala Vijay: తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ సీఐడీ విచారణ ముగిసింది. భారతి పే పోస్టు కేసుకు సంబంధించిన విచారణ నేపథ్యంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీ వర్గాలపై వైసీపీ ప్రభుత్వం కక్షకట్టి వేధిస్తోందని నేతలు ఆరోపించారు.

Chintakayala vijay
చింతకాయల విజయ్‌

Chintakayala Vijay: భారతి పే పేరిట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌ సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయ్‌ హాజరు నేపథ్యంలో సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యాలయానికి దూరంగానే టీడీపీ శ్రేణులను ఆపేశారు. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌

సీఐడీ విచారణకు వెళ్లే ముందు విజయ్‌.. గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం తమ కుటుంబంపై ఉద్దేశ్యపూర్వకంగా కేసులు పెట్టిందని అన్నారు. చట్టంపై గౌరవం ఉన్న వ్యక్తిగా సీఐడి విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు బీసీ వర్గాలపై వైసీపీ ప్రభుత్వం కక్షకట్టి వేధిస్తోందన్నారు. దుర్మార్గపు వైసీపీ పాలనలో కొన్ని ఇబ్బందులు తప్పవని అయ్యన్నపాత్రుడు అన్నారు

"భారతీ పే" అంశంపై సుమారు 6 గంటల పాటు సాగిన సీఐడీ విచారణలో పాల్గొన్న విజయ్... వారడిగిన అన్ని ప్రశ్నలకూ జవాబిచ్చినట్లు చెప్పారు. వచ్చే నెలలో మరోమారు విచారణకు రమ్మన్నారని తెలిపారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి.. విజయ్ కి సంఘీభావం తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ బీసీలపై కక్షగట్టి వేధిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అచ్చెన్న సహా బీసీ నాయకులను టార్గెట్ చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదు, పార్టీ కోసం నిజాయతీగా పనిచేస్తా. "భారతీ పే" అంశంపై వారడిగిన అన్ని ప్రశ్నలకూ జవాబిచ్చా. వచ్చే నెలలో మరోమారు విచారణకు రమ్మన్నారు. -చింతకాయల విజయ్​, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

భారతి పే పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో ఇదివరకు హైదరాబాద్‌లో విజయ్‌ నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు అక్కడ హంగామా సృష్టించారు. విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో చిన్నపిల్లలను, పనిమనిషిని భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల వైఖరిపై విజయ్‌ తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సీఐడీ పోలీసుల తీరును తప్పుపట్టింది.

విచారణకు ముందుగా 41(ఎ) నోటీసు జారీ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలనుసారం ఈ నెల 27న విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అదే రోజు లోకేశ్ పాదయాత్ర ఉండటంతో విచారణకు హాజరు కాలేనని విజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా విజయ్ ని హైకోర్టు ఆదేశించింది. విచారణను లాయర్ సమక్షంలో చేపట్టాలని కోర్టు సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.