ETV Bharat / state

విభజన చట్టం కంటే.. జగన్​ సీఎం అయ్యాకే రాష్ట్రానికి నష్టం ఎక్కువ: చంద్రబాబు - andhra pradesh capital city

chandrababu fire on cm jagan : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం వైఖరి, ఆయన చేస్తున్న విధ్వంసాన్ని సరిచేయడం రాజ్యాంగ సంస్థలకూ కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని తేల్చిచెప్పారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Feb 9, 2023, 6:06 PM IST

Updated : Feb 9, 2023, 8:18 PM IST

Chandrababu fire on CM Jagan : సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేసే విధ్వంసాలను సరిదిద్దటం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధాని పై స్పష్టంగా ఉన్నా.. 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు. పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజు ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతిపై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాల వీడియోను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.

చంద్రబాబు నాయుడు

ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా... ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతిపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలిందన్నారు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితం అంటే జగన్ రెడ్డికి అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి కుక్క అని ముద్రవేసే రీతిలో అమరావతిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. పైరవీల కోసం ఎంత నీచానికి దిగజారాలో అంత నీచంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదని పేర్కొన్నారు. ప్రజా వేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాలను సైతం వదలకుండా విధ్వంసం సాగిస్తున్నారని మండిపడ్డారు.

గంజాయి రాజధానిగా మార్చారు.. జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టడంలో దిట్ట, దోచుకోవటంలో అనకొండ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పెట్టుబడులన్నీ తరిమేసి ఏం ఒరగపెట్టడానికి విశాఖ వెళ్తున్నానని జగన్ రెడ్డి చెప్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 45వేల కోట్ల భూములు కాజేసి గంజాయి రాజధానిగా విశాఖను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారని దుయ్యబట్టారు. రుషికొండకు కూడా బోడిగుండు కొట్టించిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు.

బానిసలా..? ఎమ్మెల్యేలా..?.. విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన నష్టమే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. విధ్వంసకర చర్యల వల్ల మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని చేశారని ఆక్షేపించారు. రోజు గడిస్తే చాలన్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బానిసల్లా బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు.

ముందస్తుకు వెళ్తే పీడ విరగడం ఖాయం.. జగన్ ఓడిపోతాడని అన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవటం ఖాయమని వెల్లడించారు. ఏం నిబంధనలు అతిక్రమించారని లోకేశ్​ పాదయాత్రను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బయటకు రాకుండా అందరినీ బెదిరించి చంపేస్తారా అని నిలదీశారు.

ఫోన్ ట్యాపింగ్ వాస్తవం.. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయలు ఫోన్లు ట్యాప్ చేసి నివేదికలు ఇస్తుంటే, సీఐడీ అధికారి కొల్లి రఘురామరెడ్డి ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎమ్మెల్యేలే చేసే పెద్ద ఆరోపణ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వాస్తవం, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలిపారు. జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ అవుతున్నాయని ఆరోపించారు. జీవో నెంబర్1 దేనికోసం అని ప్రశ్నించారు. ఇవాళ ఏడుగురు చనిపోయారని పరిశ్రమలన్నీ మూసేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న కొంత మంది పోలీసుల్ని వదిలేది లేదని హెచ్చరించారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 9, 2023, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.