RTC employees problems: తెలంగాణ ఆర్టీసీ యజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించక పోవడంతో సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ధరలకు వేతనాలు చాలక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017, 2021కి సంవత్సరానికి చెల్లించాల్సిన రెండు పీఆర్సీలు ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించకపోవడంతో జీతాల పెంపు జరగలేదు. జీతాలు పెరగక కుటుంబ నిర్వహణ భారంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. 2019 కి సంబంధించిన డీఏల ఎరియర్స్ రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్ అవసరాల కోసం సీసీఎస్‌లో ప్రతినెల దాచుకున్న సొమ్మును యాజమాన్యం వాడుకుందని కార్మికులు వాపోతున్నారు. ఆమెుత్తం 630 కోట్ల కాగా వడ్డీ 260 కోట్లని తెలిపారు. ఆ విషయంపైన 2014లో కోర్టును ఆశ్రయించగా 200 కోట్లు చెల్లించారని, 2019లో మరోసారి కోర్టును ఆశ్రయిస్తే మరో 200ల కోట్లు చెల్లించారని కార్మికులు తెలిపారు. యజమాన్యం సీసీఎస్ నిధులు చెల్లించలేని పరిస్థితిలో ఉండటంతో ఇప్పటికే సుమారు 10వేల మంది కార్మికులు సభ్యత్వం రద్దు చేసుకున్నారు.
సుమారు 6వేల 500ల మంది ఉద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. అయనా యజమాన్యం స్పందించక పోవడంతో నవంబర్ 11వ తేదీన హైకోర్టులో కేసు వేశారు. ఒకటి రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన విచారణ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చదవండి: