గుంటూరు జిల్లా బాపట్ల మండలం మద్దిబోయినవారిపాలెంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న అబ్కారీ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన జర్నీ నాగరాజు, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన తాత గంగారావు తెలంగాణ మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్దిబోయినవారిపాలెంలో తెలంగాణ మద్యం విక్రయించేందుకు... తాత గంగారావు అద్దంకి నుంచి ఆటోలో తీసుకువచ్చే వాడని పోలీసులు వెల్లడించారు. దీంతో అబ్కారీ శాఖ అధికారులు దాడులు చేసి.. పశువల చావిడిలో దాచి ఉంచిన 228 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని.. ఇద్దర్నీ అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: కరోనా పాజిటివ్ వ్యక్తి అత్మహత్య