గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ అంతర్ రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా హాలియా నుంచి నరసరావుపేట వెళ్తున్న వాహనంలో విజయపురిసౌత్ అంతర్ రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద 1,96,560 రూపాయల విలువగల మద్యం బాటిళ్లను స్వాధీన చేసుకున్నట్లు మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. అక్రమ మద్యం తరలింపులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు.
ఇదీ చూడండి