ETV Bharat / state

ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న టీచర్ అరెస్ట్ - bradipeta teachers taja news

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న కీచక ఉపాధ్యాయుడిని అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరుండల్ పేట ఎస్సై రవీంద్ర తెలిపారు. గుంటూరు స్తంబాలగరువు శ్రీకృష్ణదేవరాయనగర్​లో జరిగిన ఈ ఘటన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

teacher arrested in guntur dst  due to harrasment of a student

author img

By

Published : Jul 21, 2020, 1:54 PM IST

గుంటూరు స్తంబాలగరువు శ్రీకృష్ణదేవరాయనగర్​కి చెందిన చిల్కా శ్రీనివాసరావు బ్రాడి పేటలో ప్రైవేటుగా ఇంగ్లీష్ కోచింగ్ ఇనిస్టిట్యూట్​ నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్ళై, పిల్లలు ఉన్నారు. అతని వద్దకు ఇంగ్లీష్ తరగతులు కోసం డీఈడీ 2 వ సంవత్సరం చదువుతున్న యువతి కోచింగ్ నిమిత్తం వచ్చింది.

ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఆమె వెంట పడి, ప్రేమ పేరుతో వేధించసాగాడు. యువతి ఇష్టం లేదని చెప్పడంతో ఆమె తల్లి దండ్రులను కలసి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం నిశ్చితార్థం చేసుకొని వారి వద్ద నుంచి 2 లక్షలు నగదు తీసుకున్నాడు. వివాహం చేద్దాం అనుకునే సమయానికి శ్రీనివాసరావు గతంలోనే వివాహం జరిగినట్లు తెలిసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. చెప్పవద్దని శ్రీనివాసరావు బెదిరించాడు.

తల్లిదండ్రులు అతనిపై 2019లో స్థానిక అరండల్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని కోర్టులో హాజరపరిచి జైలుకి పంపించారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు మరల ఆమెను పెళ్లి గురుంచి వత్తిడి చేయటం మొదలుపెట్టాడు.

ఆమెకు వచ్చిన సంబంధాలు అన్ని చెడగొడుతున్నాడని బాధితులు తెలిపారు. తల్లిదండ్రులు అతని పై అరుండల్ పేట పోలీస్ స్టేషన్ లో మరోసారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వివరాలను తెలిపారు.

ఇదీ చూడండి

యాంటీజెన్‌ పరీక్షల్లో అస్పష్టత... పాజిటివ్‌ ఉన్న వారికి నెగిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.