పరిపాలన చేతకాగా.. వ్యవస్థ మీద పట్టులేక వైకాపా ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు వసంతరాయపురంలోని తన క్యాంపు కార్యాలయంలో తెదేపా నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆనంద్ బాబు మండిపడ్డారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి సమయంలో విద్యుత్ ధరలను పెంచి ప్రభుత్వం పేదవారిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు విద్యుత్ చార్జీలను పెంచలేదని నక్కా ఆనంద్ బాబు అన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దమన్నారు. లాక్ డౌన్ సమయంలో వచ్చిన కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి