ముఖ్యమంత్రి జగన్ తన అనుచరుల జేబులు నింపేందుకే కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారని.. తెదేపా నేతలు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెదేపా నేతలు.. కృష్ణా కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో రహదారులు 90శాతం పనులు పూర్తయ్యాయని.. వాటిని పూర్తి చేయకుండా ఎవరికీ ఉపయోగం లేని కరకట్ట విస్తరణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఇసుకను దోచుకునేందుకే.. కరకట్ట విస్తరణ ప్రారంభించారని ఆరోపించారు. ప్రజల అవసరాలు కాకుండా తన స్వప్రయోజనాల కోసమే జగన్ పనిచేస్తున్నారని.. ఇది మరోసారి రుజువైందని వారు విమర్శించారు.
ఇదీ చదవండి:
Prakasam barrage: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు.. దిగువకు నీటి విడుదల