గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట తెదేపా నేతల నిరసన చేశారు. రెండురోజుల క్రితం యలమంద గ్రామంలో జరిగిన చిన్న గొడవకు ముగ్గురు కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ధర్నా చేశారు. వారిని విడిచిపెట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.పోలీసుల ఉద్యమాన్ని అణిచివేయడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత చదలవాడ అరవిందబాబు ఆరోపించారు.
పోలీసులు మాత్రం కేసు బనాయించిన ముద్దాయిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని తెలపడంతో....తెల్లవార్లు దాకా వారు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి స్టేషన్ కు చేరుకుని అరవింద బాబుతో చర్చించి స్టేషన్ బెయిల్ పై తెదేపా కార్యకర్తలను విడిచి పెట్టడంతో సమస్య సద్దుమణిగింది.
ఇదీచూడండి.'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి'