ETV Bharat / state

'వైకాపా పాలనలో దక్షిణాది బిహార్​లా ఏపీ తయారైంది'

వైకాపా సర్కార్​ పాలనపై తెదేపా నేతలు మండిపడ్డారు. ఆంధ్రా వర్సిటీలో అధ్యాపకుడు ప్రేమానందం విషయంలో బాధ్యులకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఇసుక పాలసీతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు.

tdp leaders jawahar, alapati raja
tdp leaders jawahar, alapati raja
author img

By

Published : Jun 3, 2020, 12:33 PM IST

జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది బిహార్​లా తయారైందని మాజీమంత్రి, తెదేపా నేత కేఎస్ జవహర్ విమర్శించారు. ఎస్సీలపై వరుస దాడులే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆంధ్రా వర్సిటీలో అధ్యాపకుడు ప్రేమానందం విషయంలో ఉప కులపతి, రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోకపోగా.. వైకాపా ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రేమానందం విషయంలో తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేసి.. ఆయనను కించపరిచేలా వ్యవహరించిన రిజిస్ట్రార్​ను అరెస్ట్ చేసి వీసీని సస్పెండ్ చేయాలని జవహర్‌ డిమాండ్‌ చేశారు.

ఇదేనా పారదర్శకత..?

వైకాపా పాలనలో ఇసుక కొనుగోలు సామాన్యులకు భారంగా మారిందని ఆలపాటి రాజా ఆరోపించారు. రీచ్​లలో ఎత్తిన ఇసుక దారిలోనే మాయమవుతోందని వైకాపా ఎమ్మెల్యేలే చెబుతున్నారని మండిపడ్డారు. కోర్టులు చీవాట్లు పెట్టినా జగన్ వైఖరిలో మార్పులేదని విమర్శించారు. హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని విజయసాయి కాపాడటమేంటని ప్రశ్నించారు. పాలనలో పారదర్శకత అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. జగన్ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారని ఆలపాటి రాజా పేర్కొన్నారు.

ఇదీ చదవండి...

స్పెషల్ లీవ్ పిటిషన్‌లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.