ETV Bharat / state

TDP Leaders : 'దిశ చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు'

గుంటూరులో జరిగిన యువతి దారుణ హత్య ఘటనలో నిందితుడిని త్వరగా పట్టుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. దిశ చట్టం పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆక్షేపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా నేతలు
తెదేపా నేతలు
author img

By

Published : Aug 15, 2021, 6:56 PM IST

Updated : Aug 15, 2021, 8:31 PM IST

మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఈ ఘటన జరగడం జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. దిశ చట్టం పేరుతో... ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆరోపించారు. రమ్య కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ఘటనను మరవకముందే రమ్య హత్య ఘటన జరగడం బాధాకరమని తెదేపా నేత నసీర్ అహ్మద్ ఆవేదన చెందారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రమ్య మృతికి కారణమైన వారిని గుర్తించాలంటూ గుంటూరు జీజీహెచ్ ఎదుట తెలుగు మహిళ విభాగం నేతలు డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తాడేపల్లి ఘటనను గుర్తు చేసిన తెలుగు మహిళలు.. దిశ చట్టం ఎక్కడ అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య ఘటన అమానుషమని మాజీ మంత్రి చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే యువతి దారుణ హత్యకు గురవటం బాధాకరమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు పెరిగాయని ఆమె ఆరోపించారు.

అనుబంధ కథనం:

Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు

Last Updated : Aug 15, 2021, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.