ETV Bharat / state

'వైకాపా శ్రేణుల్ని పోషించటానికే నూతన ఇసుక విధానం' - నూతన ఇసుక విధానంపై సుజయ్​ కృష్ణ

ఇసుక నూతన విధానం వైకాపా శ్రేణుల్ని పోషించటానికే అని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. వైకాపా నేతలు నిర్వహించే ఇసుక రీచ్​లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తెదేపా పోరాడుతుందని చెప్పారు.

నూతన ఇసుక విధానంపై సుజయ్​ కృష్ణ
author img

By

Published : Oct 9, 2019, 12:29 PM IST

నూతన ఇసుక విధానంపై సుజయ్​ కృష్ణ

భవన కార్మికులు రోడ్డెక్కే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందిని మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు విమర్శించారు. నూతన ఇసుక విధానం వైకాపా శ్రేణుల్ని పోషించటానికే అని ఆరోపించారు. ఇసుక మాఫియాలో మంత్రులు భాగం పంచుకుంటూ.. ప్రజా శ్రేయస్సును గాలికొదిలేశారని మండిపడ్డారు. భవన కార్మికులకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైకాపా నేతలు నిర్వహించే ఇసుక రీచ్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగుదేశం పోరాడుతుందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక విధానాన్ని యధాతథంగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన 4నెలల్లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా కూల్చేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పెట్టుబడిదారుల్లో కల్పించిన నమ్మకాన్ని జగన్ కోల్పోయేలా చేశారని సుజయ్​ కృష్ణ విమర్శించారు. వైకాపా ప్రభుత్వంపై బ్యాంకర్లలోనూ విశ్వాసం లేదనటానికి SBI లేఖే నిదర్శనమని అన్నారు.

ఇదీ చదవండి

కమనీయం.. రమణీయం.. ఇంద్రకీలాద్రి మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.