గవర్నర్ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మంత్రులు చెప్పే అబద్ధాలను గవర్నర్‌తో చెప్పించారని తెదేపా నేత నక్క ఆనంద్ బాబు విమర్శించారు. రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటాన్ని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్‌బాబు తప్పుపట్టారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం అక్రమ రవాణా పెరిగిపోయిందని... వాటిని పక్కదారి పట్టించేందుకు తెదేపా నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలు మినహా ప్రజలకు సాయం చేయలేదని విమర్శించారు.
కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి ప్రభుత్వం ఏం చేసిందని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు ప్రశించారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటానికి, చెరపడానికి రూ.2300కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
ప్రతిరోజూ వైకాపా మంత్రులు చెప్పే అబద్ధాలను గవర్నర్‌తో చెప్పించారు. ప్రసంగం అంశాలు క్షుణ్ణంగా చదివితే అది తప్పనే విషయం అర్థమవుతుంది. రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం ఏంటి? సరైన జాగ్రత్తలు తీసుకుని మరికొన్ని రోజులు నిర్వహించలేరా?
-నక్కా ఆనంద్ బాబు
ఇదీ చదవండి: