డ్రగ్స్‌కు కేంద్ర బిందువుగా ఆంద్రప్రదేశ్ మారిందని నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట పార్లమెంట్ తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో డ్రగ్స్(DRUGS) మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేరుగా రాష్ట్రానికి డ్రగ్స్ రావడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో లిక్కర్ తయారీదారులు వైకాపా నాయకులేనని ఆరోపించారు.
మద్యంలో సైతం డ్రగ్స్ కలిపి అమ్ముతున్నారన్న అనుమానం ఉందని జీవీ ఆంజనేయులు తెలిపారు. కేంద్ర బృందాలతో(CENTRAL TEAM) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశి కంపెనీ సీఎం భార్య బంధువులదేనని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కొడుకే డ్రగ్స్ డీలర్ అని.. ఆయన డ్రగ్స్ మాఫియాకు సీఎం అండదండలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి చేతకాలేదన్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖలో 14,300 ఉద్యోగాలు కొత్తగా ఎలా ఇస్తారని నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: