అమ్మఒడి పథకం ద్వారా ఎడాదికి ఒకసారి 14 వేల రూపాయలిస్తున్న ప్రభుత్వం.. ప్రతి నెలా పన్నుల రూపంలో ప్రజల నుంచి అంతే మొత్తం గుంజుకుంటోందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిత్యవసరాల ధరలు పెంచేశారని ఆరోపించారు. రేషన్ పంపిణీ పేరుతో కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. బెదిరింపు రాజకీయాలకు ఆనవాలుగా వైకాపా ప్రభుత్వం ఉందని దివ్వవాణి అన్నారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ