ETV Bharat / state

చెట్టు, పుట్టకు కూడా ఓటు హక్కు - ఫాం7 దుర్వినియోగంపై ఎన్నికల అధికారిని కలిసిన టీడీపీ నేతలు

TDP Leader Acham Naidu And Team Met AP CEO MK Meena: ఓటరు జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడిన వారిపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టరాదని.. తెలుగదేశం నేతలు డిమాండ్‌ చేశారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను కలిశారు. ఫాం-7 దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి సీఎం జగన్ ఓట్లు తొలగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

tdp_leader_acham_naidu
tdp_leader_acham_naidu
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 5:50 PM IST

TDP Leader Acham Naidu And Team Met AP CEO MK Meena: జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. వైసీపీకి చివరి ఘడియలు దగ్గరపడ్డాయని ఎద్దేవా చేశారు. ఓట్ల అవకతవకలపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డిచంద్రమోహన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలు సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిశారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఓట్లు లేకుండా చేయాలని వైసీపీ అరాచకాలు మొదలుపెట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి సీఎం జగన్ ఓట్లు తొలగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

చెట్టు, పుట్టకు కూడా ఓటు హక్కు - ఫాం7 దుర్వినియోగంపై ఎన్నికల అధికారిని కలిసిన టీడీపీ నేతలు

ఏపీలో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై టీడీపీ నేతల బృందం ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది. నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎన్ని తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో డేటా తయారు చేసి ఎన్నికల అధికారికి అందజేశారు. ఫామ్‌- 7ను దుర్వినియోగం చేస్తూ ఏ విధంగా ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారనేది నేతలు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఫారం 6, ఫారం 7 లకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని టీడీపీ నేతలు తెలిపారు. ప్రతిరోజు ఓటు ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ ఫోన్లో చూసుకోవాల్సి పరిస్థితి నెలకొందని ఎద్దేవాచేశారు. ఒకే ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు బూతుల్లో వారికి ఓట్లు ఉన్నాయని విమర్శించారు.

'వైసీపీతో పెట్టుకుంటే ఓట్లు గల్లంతే' ఒకరి ఓటు తొలగించాలని మరొకరు దరఖాస్తు - ఉద్యోగులు, సామాన్య ఓటర్లు షాక్

తాము ఓట్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేస్తుంటే... పేరుకే కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పటికి ఎన్నికల సంఘానికి 13 లేఖలు ఇచ్చామని, ఆధారాలతో సహా ఎన్నికల సంఘాన్ని కలిశామన్నారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని టీడీపీ నేతలు తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు కూడా ఇంకా లిస్టులో ఉన్నాయన్నాయని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చెట్టు ఫోటో పెట్టి ఓటు ఇచ్చారన్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందని విమర్శించారు. కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 12 వేల ఓట్లు తారుమారు అయ్యాయని పార్టీ నేతల బృందం ఆరోపించారు.

ఉరవకొండలో తప్పులతడకగా ఓటర్ల జాబితా - ఒకే ఇంటి నెంబర్​తో పదుల సంఖ్యలో ఓట్లు

'వాలంటీర్ల ద్వారా ఓట్లు తొలగించి గెలవాలని చూస్తున్నారు. ఫామ్‌-6, ఫామ్‌-7కు సంబంధించి పెండింగ్‌లో 11 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఓటు ఉందా లేదా అని రోజూ ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సి వస్తోంది. అక్రమాలపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘాన్ని కలిశాం. ఇప్పటికి ఎన్నికల సంఘానికి 13 లేఖలు ఇచ్చాం. పేరుకే కేసులు పెడుతున్నా ఎవరిపై చర్యలు తీసుకోవట్లేదు. త్వరలో మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం.' అచ్చెన్నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు

ఎన్నికల్లో గెలిచేదెవరు? ఈసారి యువత, మహిళల ఓట్లు ఎటువైపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.