లాక్ డౌన్ నేపధ్యంలో పేదలకు సాయం చేస్తున్నామని వైకాపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ...సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్కును అయన కలెక్టర్ కు అందజేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీ నెపంతో ఎన్నికల ప్రచారం చేయడం సరికాదన్నారు. వైకాపా నేతలు వార్డు వాలంటీర్లలతో కలసి ఫించన్లు పంపిణి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి లో ఓ మహిళకు 2250 రూపాయల ఫించన్ రావాల్సి ఉంటే.. వార్డ్ వాలంటీర్లు 1000 మినహాయించి ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే ఆ వాలంటీర్ల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
ఇవీ చూడండి: