TDP Azadi ka Amrit Mahotsav.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు.. తెలుగుదేశం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15న గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో సభ కోసం భూమిపూజ నిర్వహించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌కుమార్.. కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. దేశం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో.. తెలుగుదేశం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుందని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జాతీయ జెండాను ఆవిష్కరించి తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని నాయకులు తెలిపారు.
ఇవీ చదవండి: