ETV Bharat / state

పట్టణవాసులపై పడనున్న పన్నుల భారమేంటో తెలుసాా..?

కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగర, పట్టణ వాసులపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 10 నుంచి ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పన్నులు పెరగనున్నాయి. ఇప్పటివరకు ఉన్న పన్నులతో కలిపి 10 నుంచి 15 శాతం పెంచే అవకాశం ఉంది. ఖాళీస్థలాలు, తాగునీటి పన్ను పెంపుతో పాటు.. పట్టణాల వారీగా వడ్డన ఎలా ఉండబోతుందో ఈటీవీ భారత్​ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

Breaking News
author img

By

Published : Dec 17, 2020, 2:12 PM IST

కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగర, పట్టణ వాసులపై ఆస్తిపన్ను రూపంలో పన్నుల వడ్డనకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10వ తేది నుంచి ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. దీంతో వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ఆస్తిపన్నుతోపాటు ఖాళీస్థలాలు, తాగునీటి పన్నులు ఇక ప్రియం కానున్నాయి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించి వాటికి అనుగుణంగా ఎవరిపై ఎంత భారం మోపవచ్చనే ఆలోచనకు ఇప్పటికే పురపాలక సంఘాలు ఓ అంచనాకు వచ్చాయి. గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంతోపాటు 12 పట్టణాల్లో 3,91,572 అసెస్‌మెంట్లు ఉండగా... వాటి నుంచి ఆస్తిపన్ను రూపంలో ప్రస్తుతం రూ.190.22 కోట్ల ఆదాయం లభిస్తుంది. సగటున 15 శాతం పెంపుదల ఉంటే జిల్లాలోని పట్టణ వాసులపై దాదాపు రూ.28.53 కోట్ల భారం పడునుంది.

పన్నులు ఎక్కడ ఎలాా..?

* కొత్తగా నగర పంచాయతీలైన దాచేపల్లి, గురజాల వాసులు ఈ పన్నుల భారం తప్పదు. నూతన పన్ను విధానంలోకి వారు రాబోతుండటంతో మొన్నటివరకు పదులు, వందల్లో ఉన్న ఆస్తిపన్ను ఇక నుంచి రూ.వేలల్లో ఉండనుంది.

* 2002 సంవత్సరం నుంచి నివాసగృహాలు.. 2007 నుంచి వాణిజ్య భవనాలకు పన్నుల పెంపుదలలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో ఐదేళ్లకు ఒకసారి రివిజన్‌ పేరిట పన్నులు పెంచేవారు. ఇక నుంచి ఏటా పన్నులు పెంచుకునే అవకాశాన్ని పురపాలక సంఘాలకు ప్రభుత్వం కల్పించింది.

* నివాసగృహాలకు ఆస్తి విలువలో 0.10 శాతం నుంచి 0.20 శాతం.. నివాసేతర భవనాలకు 2 శాతం పన్నుభారం పడబోతుంది. ఆస్తి విలువ రూ.2 లక్షలు ఉంటే పన్ను రూ.40 వేలు వరకు చెల్లించాల్సి రావచ్చు.

* ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను 10 నుంచి 15 శాతం.. వచ్చే ఏడాది మరో 10 శాతం పన్ను పెంచనున్నారు.

* ఖాళీ స్థలాలకు పట్టణాల్లో ఆస్తి విలువలో 0.10 శాతం నుంచి 0.20 శాతం, నగరాల్లో 0.50 శాతం పన్ను విధింపు ఉండబోతుంది. పరిసరాలకు హానీ కలిగిస్తే(ఖాళీ స్థలాల్ని అధ్వానంగా ఉంచితే) 0.25 శాతం పన్ను విధింపు ఉంటుంది.

* రిజిస్ట్రేషన్‌ విలువ విధానంలోకి మార్చిన తర్వాత మొత్తం పన్నులో ఎంతశాతం విధించాలో అధికారులు నిర్ణయిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల నిర్ణయానికి అనుగుణంగా పన్నుల పెంపుదల ఉండబోతుంది. పాలకవర్గ తీర్మానంపై ముసాయిదా రూపొందించి ఆస్తిపన్ను మండలికి పంపి అక్కడి నుంచి ఈ నెలాఖరులోగా అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

"నూతన విధానంలో ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా ఉండనుంది. పెంపుదల నిర్ణయం తీసుకున్న తర్వాత మారిన పన్నుతో కూడిన నోటీసులను భవన యజమానులకు అందజేసి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తాం. సహేతుకమైన కారణాలుంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్నులు అమల్లోకి వస్తాయి." _ గుంటూరు ఆర్డీ జి.శ్రీనివాసరావు

ఇదీ చదవండీ: రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సమర్పించిన ఏపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.