గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని 2000 కుటుంబాలకు... మాజీ సర్పంచ్, జీడీసీసీబీ మాజీ డైరెక్టర్ కుర్ర రత్తయ్య, అప్పారావు.. సరకులు పంచారు. ఒక్కొక్కరికి రూ.2 వేల విలువైన వస్తువులు అందించారు. బియ్యం, కోడిగుడ్లు, బిస్కెట్లు అన్నీ కలిపి సంచుల్లో నింపి... కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర (నాని) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుర్ర రత్తయ్య, అప్పారావు లాంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎడ్లపాడు మండలం తెదేపా అధ్యక్షులు ముద్దన నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పావులూరి శ్రీనివాసరావు ,కొండ్రగుంట శ్రీనివాసరావు గళ్ళ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: