అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతమవుతున్న గుంటూరు ప్రజలకు.. చిరుజల్లులు ఉపశమనం కల్పించాయి. ఒక్కసారిగా చల్లగా మారిన వాతావరణాన్ని నగరవాసులు ఆహ్లాదిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 6.3 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
మండలాల వారీగా చూస్తే... దుర్గి 70.8, మాచర్ల 39.2, ఈపురు 32.6, రెంటచింతల 32.2, గురజాల 30.6, దాచేపల్లి 24.8, కారంపూడి 18.2, బొల్లాపల్లి 18, పిడుగురాళ్ల 16.2, బెల్లంకొండ12.6, మాచవరం10.6, రేపల్లె10.2, అచంపేట 9.6, రాజుపాలెం 9, క్రోసూరు 7.6, నూజండ్ల6.8, నిజాంపట్నం3.6, అమరావతి3.2, వెల్దుర్తి 3.2, నేకరికళ్ళు 1.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి:
చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్‌తో ఒప్పందం