గుంటూరు జిల్లా బాపట్లలోని ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. తెనాలికి చెందిన బి. ఉదయ్ కిరణ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అప్పటి వరకూ స్నేహితులతో క్రికెట్ ఆడుతున్న అతను చాతి నొప్పిగా ఉందని కుప్పకూలాడు. కళాశాల యాజమాన్యం తక్షణమే బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. ఈ సంఘటనతో కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమతో క్రికెట్ ఆడిన స్నేహితుడు మృతి చెందడంపై విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఇదీ చదవండి: