ETV Bharat / state

ANIL SINGHAL: గుంటూరులో అనిల్ సింఘాల్ పర్యటన.. ప్రభుత్వ స్థలాల పరిశీలన - guntur latest news

గుంటూరు జిల్లాలోని పలు ప్రభుత్వ భూములను వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్(anil kumar singhal) పరిశీలించారు. అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు హెల్త్ హబ్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

state-health-secretary-anil-kumar-singhal-inspected-govt-lands-in-guntur
గుంటూరులో అనిల్ సింఘాల్ పర్యటన
author img

By

Published : Jul 10, 2021, 10:12 PM IST

గుంటూరు జిల్లాలో అత్యాధునిక వైద్యసేవలు అందించేంచుకు.. హెల్త్ హబ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను గుర్తించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జె.వి.ఎన్.సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతిలతో కలసి లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం, మంగళగిరి ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. లాం పరిశోధన కేంద్రంలోని ఐదు ఎకరాలు, తాడేపల్లి మండలం వడ్డేశ్వరం పరిధిలోని 4.46 ఎకరాలను పరిశీలించారు. లాం పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్తలతో.. అందుబాటులో ఉన్న స్థల లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

ఇదీచదవండి.

Arrest: అధిక ధరలకు శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు..ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.