ETV Bharat / state

కుటుంబ పాలనలు వారి అభివృద్ధికే: సోము వీర్రాజు - State BJP president Somu Veerraju visits Dachepalli

గుంటూరు జిల్లా పల్నాడు పర్యటనలో భాగంగా దాచేపల్లి గ్రామంలో.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. పుల్వామా దాడిలో అమరలైన గ్రామానికి చెందిన వీర సైనికులకు నివాళులర్పించారు.

State BJP president Somu Veerraju
కుటుంబ పాలనలు వారి అభివృద్ధికే
author img

By

Published : Feb 14, 2021, 8:22 PM IST

పల్నాడు పర్యటనలో భాగంగా దాచేపల్లి గ్రామంలో పర్యటించిన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు... అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనలు వారి అభివృద్ధికే కానీ.. రాష్ట్ర అభివృద్ధికి కాదు. కేంద్రం నుంచి ఒక మెడికల్ కాలేజీకి 50 కోట్లు నిధులు వస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ సొంత నిధులతో మెడికల్ కాలేజీ పెడుతున్నామని అంటున్నారు. రాష్ట్రంలో ఇంటింటికి త్రాగునీరు, గ్రామాల్లో ఎంజీఎన్​ఆర్ ఈజీఎస్ కింద సీసీ రోడ్లను కొన్ని వేల కోట్లతో అబివృద్ధి చేస్తుంటే.. వైకాపా ప్రభుత్వం, నాయకులు తామే చేసినట్లు ప్రచారాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన, భాజపా మద్దతుదారులను బెదిరిస్తూ వితిడ్రా చేయిస్తున్నారు. అధికార పార్టీకి ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవండీ. నడికూడి-శ్రీకాళహస్తి రైల్యేలైన్, అద్దంకి-నార్కెట్​పల్లి జాతీయ రహదారి భాజపా వల్లే సాధ్యం అయింది. రాష్ట్రంలో కుటుంబ పాలనలకు చరమగీతం పాడాలి. రాష్ట్రాభివృద్ది భాజపాతోనే సాధ్యం. గురజాల నియోజకవర్గంలాగే పలుచోట్ల బలమైన యవ నాయకులు భాజపాలో చేరుతున్నారు. రానున్న రోజుల్లో జనసేన, భాజపా జెండాలు ఎగరటం ఖాయం. -సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండీ.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు: సోమువీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.