గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలోని పొలాల్లో సాగుచేస్తున్న మిర్చి పంటపై దుండగులు రసాయనాలను పిచికారీ చేశారు. దాంతో 10 ఎకరాల విస్తీర్ణంలోని పంట పూర్తిగా వాడిపోయింది. పచ్చగా కళకళలాడాల్సిన పైరు వాడిపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్లూస్ టీమ్ పొలాల వద్దకు చేరుకుని పంటను పరిశీలించారు. జాగిలాలతో గాలించారు. నిందితులు ఎవరు..? ఎలాంటి రసాయనాన్ని పిచికారీ చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: