ETV Bharat / state

వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల బిల్లుల చెల్లింపు శరవేగంగా.. - గుంటూరు జిల్లా తాజా వార్తలు

వ్యవసాయానికి ఎంత మేరకు విద్యుత్తు వాడకం జరుగుతుందో రైతుల వారీగా పక్కాగా లెక్క కట్టడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు దశలుగా ఈ విధానాన్ని వర్గీకరించిన అధికారులు తాజాగా తొలి దశను పూర్తిచేశారు. పాక్షిక లాక్‌డౌన్‌ తర్వాత రెండో దశను మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తిచేసి, మలి దశలో మీటర్లు బిగించేందుకు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత విభాగం వరకు ప్రస్తుతం ఈ పని మీదే యంత్రాంగం నిమ్నగమైంది.

agri meters
వ్యవసాయ మీటర్లు
author img

By

Published : May 15, 2021, 2:13 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి మీటర్లు లేవు. విద్యుత్తు విభాగం సబ్‌స్టేషన్ల వారీగా ఉన్న సాగు విద్యుత్తు కనెక్షన్ల వాడకాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి పంపేది. ఉచిత వ్యవసాయ విద్యుత్తు పంపిణీ విధానంలో భాగంగా సంబంధిత మొత్తాన్ని ప్రభుత్వం విద్యుత్తు విభాగానికి చెల్లించేది. ఈ యావత్తు ప్రక్రియలో ఎక్కడా రైతుల ప్రమేయం ఉండేది కాదు. విద్యుత్తు విభాగ మూడో దశ సంస్కరణల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నారో పక్కాగా లెక్క ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. సాగుకు ఉచిత విద్యుత్తు అందించే విధానాలు అమల్లో ఉంటే దాని కోసం డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. అంటే ఉదాహరణకు వంట గ్యాస్‌ రాయితీ వినియోగదారుల ఖాతాల్లో నేరుగా చేరుతున్నట్లన్నమాట. ఈ ఆదేశాల అమల్లో భాగంగా మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకంగా నామకరణం చేసి పక్కాగా లెక్క తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రికార్డుల ఆధునికీకరణ
రాష్ట్రంలో సాగుకు ఉచిత విద్యుత్తు పథకాలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. ఆ పాత రికార్డులను ఆధునికీకరించి నూతన జాబితాలను సిద్ధం చేయడం ఈ పథకంలో తొలి దశ. గుంటూరు జిల్లాలో మొత్తం వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు 1,07,575 ఉన్నాయి. వీటిలో క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం ఉన్న యజమాని పేరు, దస్త్రాల్లో ఉన్న పేర్లు ఒకటా, కాదా? అన్న అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. విద్యుత్తు, వ్యవసాయ, రెవెన్యూ విభాగాల నుంచి సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి తాజా రికార్డులను తయారు చేశారు. ఇందులో భాగంగా 1,04,614 మంది వివరాలను నమోదుచేశారు. అంటే 97.25 శాతం మంది రైతుల వివరాల క్రీడోకరణ పూర్తైంది. మిగిలిన వారిలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, అంతర్గతంగా భూ పంపిణీ వివాదాలున్న వారు, ఆస్తుల పంపకాలు పూర్తవని వారు, దేవదాయశాఖ పరిధిలోని భూములను సాగుచేస్తున్న వారున్నారు. ఈ 2,961 మంది రైతులకు సంబంధించి వారి, వారి వ్యక్తిగత ఆస్తి పంపకాలు పూర్తయిన తర్వాత, ఇతర అంశాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తదుపరి దశలో నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన వారంతా ఉచిత విద్యుత్తు పథకంలో నమోదయ్యారు. గత రెండు నెలల నుంచి సాగుతున్న ఈ ప్రక్రియ తాజాగా పూర్తయింది.

గుత్తేదారు ద్వారా మీటర్ల ఏర్పాటు
ప్రతి సాగు కనెక్షన్‌కు విద్యుత్తు వినియోగ మీటర్లను బిగించడం మూడో దశ. ఈ కార్యక్రమాన్ని విద్యుత్తు విభాగం ఏజెన్సీలకు (గుత్తేదారులకు) అప్పగించనుంది. ప్రస్తుతం ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మొత్తం మీద అనేక అభ్యంతరాలు, విమర్శలను అధిగమించి సాగు విద్యుత్తుకు మీటర్లు బిగించే పని పట్టాలెక్కుతోంది. ప్రభుత్వం ఈ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, వారి మీద ఎలాంటి భారం పడదని ఇప్పటికి ఒకటికి నాలుగు మార్లు ప్రకటించింది. నిజంగా అదే తీరులో తర్వాతి రోజుల్లోనూ సాగితే యావత్తు ప్రక్రియకు సార్ధకత చేకూరుతుంది.

ప్రతి ఫీడర్‌లో తేలనున్న విద్యుత్తు వినియోగం
వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకంలో రెండో దశ ప్రతి రైతు పేరిట బ్యాంకుల్లో ‘ఎక్స్‌క్రొ’ ఖాతాలను ప్రారంభించడం. వ్యవసాయ విద్యుత్తు కోసమే ప్రత్యేకించిన ఈ ఖాతాలో ఆ రైతు నెలకు ఎన్ని యూనిట్లు విద్యుత్తును వినియోగించారో ఆ రుసుముల మొత్తాన్ని ప్రభుత్వం ఈ ఖాతాలో వేస్తుంది. మరుక్షణం ఆ మొత్తం విద్యుత్తు విభాగానికి చేరుతుంది. ఇదంతా ఎందుకంటే ప్రతి రైతుకు తాను ఎంత విద్యుత్తును వాడుతున్నారో, ప్రభుత్వం తమ తరుపున విద్యుత్తు విభాగానికి ఎంత మొత్తం చెల్లిస్తుందో తెలియచేయడం కోసం. మరో వంక ప్రతి ఫీడర్‌ పరిధిలో ఉన్న రైతుల వినియోగం విద్యుత్తు విభాగానికి తెలియడం ద్వారా అందుకు అనుగుణమైన పంపిణీ ఏర్పాట్లకు వారికి సౌలభ్యంగా ఉంటుంది. మొత్తం మీద బాధ్యతాయుత నిర్వహణ కోసం కసరత్తు జరుగుతోంది.

త్వరలోనే ఖాతాల ప్రారంభం
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించే ప్రక్రియకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రికార్డుల ఆధునికీకరణ పూర్తయింది. రైతుల పేరిట బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాల ఏర్పాటును త్వరలో ప్రారంభించి నెల రోజుల్లోగా పని పూర్తిచేస్తాం. తర్వాత ఏజెన్సీల ద్వారా మీటర్లు బిగించే పని మొదలవుతుంది. మొత్తం మీద మరో మూడు నెలల్లో ఇదంతా పూర్తవుతుంది. సాగుకు ఎంత విద్యుత్తు వినియోగం జరుగుతుందో పక్కాగా లెక్క తేలుతుంది. ప్రతి కనెక్షన్‌కు మీటరు బిగించడంతో పాటు ‘ఎర్తింగ్‌’ పనిని కూడా ఉచితంగా పూర్తిచేస్తాం. దాని వల్ల ప్రమాదాలను నివారించే వీలుంటుంది. - నూతలపాటి సింగయ్య, విద్యుత్తు విభాగ డీఈ, తెనాలి

ఇదీ చదవండీ.. రైతుకు మంట.. వ్యాపారికి ‘పంట’..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.