ETV Bharat / state

ఆస్తి కోసం మామను హత్య చేసిన అల్లుడు

వ్యసనాలకు బానిసై.. ఆస్తి కోసం మామను అల్లుడు హత్య చేశాడు. ఈ కేసు వివరాలను పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్​లో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

son-in-law-killed-uncle-for-property
ఆస్తి కోసం మామను హత్య చేసిన అల్లుడు
author img

By

Published : Dec 23, 2020, 12:43 PM IST

ఆస్తి కోసమే మామను అల్లుడు హత్య చేసిన ఘటన వివరాలను.. పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్​లో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. పొన్నూరు మండలం వల్లభరావుపాలానికి చెందిన బండారుపల్లి శివరామకృష్ణ (59) నెల్లూరు జిల్లా రాపూరులోని సీవీకే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కామర్స్ లెక్చరర్​గా పనిచేశారు. ఆయన కుమార్తె మౌనిక, చెరుకూరి సుమన్.. ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుమన్ చెడు స్నేహాలకు అలవాటుపడి డబ్బులు ఎక్కువగా ఇవ్వాలని శివరామకృష్ణతో వివాదానికి దిగాడు. సమయంలో చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆస్తి తనకు దక్కదన్న అక్కసుతోనే సుమన్ తన స్నేహితుడైన వెంకట నరేష్, మనోజ్​తో కలిసి ఈ నెల 7వ తేదీన శివరామకృష్ణను రాపూరులోని కళాశాల నుంచి కారులో ఎక్కించుకుని బయలుదేరారు. పెదనందిపాడు మండలం బండ్లవారిపాలెం సమీపంలో కారును ఆపి శివరామకృష్ణను ముక్కు, నోరు, మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పొన్నూరు పట్టణ శివారులో పడేసి వెళ్లి పోయారు. ఆయన మృతిపై అనుమానం రావడంతో పలు కోణాల్లో విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. అర్బన్ సీఐ పి.ప్రేమయ్య, ఎస్సై బత్తుల ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

లక్కీ డ్రా పేరిట మోసాలు... నిందితుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.