ETV Bharat / state

SMART METERS : మీటర్లూ అయిన వాళ్లకే.. ప్రశ్నిస్తే దాడులు.. గిట్టని వాళ్లని పనులంటూ దోపిడీ - స్మార్ట్‌ మీటర్‌ వార్త

Electricity Smart Meters : కావాల్సిన వాళ్లకి మేలు చేయడం ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డగోలు వాదనలు తెరపైకి తెచ్చి ఎదురుదాడి చేయడం. అయినా నిలదీస్తే ఇదంతా గిట్టని వాళ్లు చేస్తున్నారని ప్రజలను నమ్మించడం.. ఇదీ వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఓ వైపు ఎక్కడా ఇవ్వనంత ధరలకు అస్మదీయ కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూనే.. అదేం లేదంటూ ప్రభుత్వం బుకాయిస్తోంది.

SMART METERS IN AP
SMART METERS IN AP
author img

By

Published : Jun 10, 2023, 7:53 AM IST

మీటర్లు కూడా అయిన వాళ్లకే.. ప్రశ్నిస్తే దాడులు.. గిట్టని వాళ్లని పనులంటూ..

Electricity Smart Meters to Pump Sets: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల పేరిట భారీ కుంభకోణానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్రంలో మొత్తం 18.58 లక్షల మీటర్ల కోసం ఏకంగా 6,888 కోట్లు ఖర్చు చేయనుంది. గత రెండు రోజుల క్రితమే రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఇక అస్మదీయులకు పనులు అప్పగించడమే తరువాయి. ఈ స్మార్ట్‌ మీటర్ల కాంట్రాక్ట్‌ను ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు, కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకే కట్టబెట్టినట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో మీటరుపై ఆ సంస్థకు డిస్కంలు కట్టబెడుతోంది ఏకంగా 37,072.28 రూపాయలు. ఇంత భారీ ధర ఎందుకని ప్రశ్నిస్తే.. మీటరు ఏర్పాటు, నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుల నుంచి వసూలు చేయడం లేదు కదా అంటూ వింత వాదన తెరపైకి తెస్తోంది. రైతుల నుంచి నేరుగా వసూలు చేయకపోయినా, పరోక్షంగా ఆ భారం వేసేది రాష్ట్రంలోని మొత్తం విద్యుత్‌ వినియోగదారులపైనే అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు మర్చిపోయినట్లు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు అమర్చే ఒక్కో స్మార్ట్‌ మీటర్‌పై 35 వేల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టబోతోందని.. దానిలో మీటరు ధర 6 వేలు, అనుబంధ పరికరాలు, ఐదేళ్ల నిర్వహణకు ఏకంగా 29 వేలు ఖర్చు చేయబోతోందని 2022 అక్టోబరు 24న ఈటీవీ - ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించాయి. 2022 సెప్టెంబరు నెలాఖరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం కోసం మూడు డిస్కంలు అందజేసిన సమాచారం ఆధారంగానే ఈ కథనాన్ని రాశారు. దానిపై మంత్రి పెద్దిరెడ్డి విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డారు.

గతంలో రద్దు చేసిన టెండర్లపై ఈటీవీ- ఈనాడు తప్పుడు రాతలు రాశాయని.. కొవిడ్‌ సమయంలో రూపొందించిన ఆ టెండర్‌ అంచనాల్ని సమీక్షించుకుని, హెచ్చుతగ్గులున్నాయని గ్రహించి గతంలోనే రద్దు చేశామని చెప్పారు. కొత్త అంచనాల మేరకు ఒక్కో మీటరుకు 6 వేలు, అనుబంధ పరికరాలకు 14,455 చొప్పున ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఒక్కో స్మార్ట్‌ మీటర్‌కు అనుబంధ పరికరాలు, నిర్వహణకు 29 వేలు చొప్పున ఖర్చవుతుందన్న ఈటీవీ-ఈనాడు కథనంలో నిజం లేదని పేర్కొన్నారు. అప్పుడు అంత అడ్డగోలుగా బుకాయించిన మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

మంత్రి చెప్పినట్టే మీటరు ధర 6 వేలు అనుకుంటే, అనుబంధ పరికరాలు, నిర్వహణకు 31 వేలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన ఐదేళ్ల నిర్వహణ కాలాన్ని 93 నెలలకు పెంచారు. ఐతే మాత్రం అనుబంధ పరికరాలు, నిర్వహణకే మీటరు ధరకు ఐదు రెట్లకు మించి వెచ్చిస్తారా? మీటరు ధర కంటే అనుబంధ పరికరాల ధరే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందా? అంటే సమాధానం లేదు.

స్మార్ట్‌ మీటర్ల కోసం ఏకంగా 6,888 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. టెండర్లు ఎప్పుడు పిలిచింది, ఏ సంస్థలు పాల్గొన్నాయి, ఎల్‌1గా వచ్చిన సంస్థ ఏది, ఏ ప్రాతిపదికన టెండర్‌ కట్టబెట్టారు వంటి వివరాలను వెల్లడించడం లేదు. కావాల్సిన వారికి కట్టబెట్టినందువల్లే సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేసిందని అర్థమవుతోంది. 2022 వ సంవత్సరం సెప్టెంబరు 29న మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం కోసం డిస్కంలు అందజేసిన సమాచారం ప్రకారం.. అప్పటికి ఏడాది క్రితమే స్మార్ట్‌మీటర్లపై గుత్తేదారు సంస్థలకు షరతులతో కూడిన లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్లు జారీ చేసినట్లు పేర్కొన్నాయి.

సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు 2022 సెప్టెంబరు 23న ఎస్‌పీడీసీఎల్‌ సమాధానమిస్తూ.. తమ పరిధిలో 11 లక్షల మీటర్ల ఏర్పాటుకు 2021 సెప్టెంబరు 2న టెండర్లు పిలిచామని, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌తో పాటు మరో నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయని తెలిపింది. గుత్తేదారు సంస్థతో ఇంకా ఒప్పందం ఖరారు కాలేదని చెప్పింది. ఆ వివరాలను ఈనాడులో- ఈటీవీలో అక్టోబరు 24న కథనం రాయాగా.. పెద్దిరెడ్డి అదే రోజు విలేకరుల సమావేశంలో పాత టెండర్లు రద్దు చేశామని చెప్పారు. మరి కొత్తగా పిలిచిన టెండర్లు, పాల్గొన్న సంస్థలు, బిడ్ల వివరాలు వెల్లడించకపోవడానికి కారణమేంటన్నది మాత్రం చెప్పటం లేదు.

విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో స్మార్ట్‌మీటర్‌కు అంత భారీ మొత్తం వెచ్చించడంపై నిపుణులు, ఆర్థిక వేత్తలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు విమర్శిస్తుననాయి. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో వ్యవసాయ మోటార్లకు పైలట్‌ ప్రాజెక్టుగా అమర్చిన ఐఆర్‌డీ పోర్టు మీటర్లపై అధ్యయనం చేసిన ‘ప్రయాస్‌ సంస్థ ’ నివేదికను ఉటంకిస్తూ.. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 2022 సెప్టెంబరు 15న డిస్కంలకు లేఖ రాశారు.

స్మార్ట్‌మీటర్లకు డిస్కంలు ఖరారు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందులో ఆయన స్పష్టంగా చెప్పినా.. ప్రభుత్వం ముందుకే వెళ్లింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని విద్యుత్‌ పంపిణీ సంస్థ ఒక్కో మీటరుకు 10 వేల చొప్పున 75 లక్షల స్మార్ట్‌ మీటర్ల సరఫరా, నిర్వహణ కోసం అదానీ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. రద్దుకు కారణాలేమైనా అక్కడ గృహవిద్యుత్‌ వినియోగదారులకు ఒక్కో స్మార్ట్‌ మీటర్‌ అమర్చేందుకు, నిర్వహణకు అదానీ సంస్థ కోట్‌ చేసిన ధర 10 వేలు మాత్రమే. పోనీ వ్యవసాయ మోటార్లకు నిర్వహణ వ్యయం కొంచెం ఎక్కువనుకున్నా.. మరీ ఒక్కో మీటర్‌కు ఏకంగా 37 వేల రూపాయలు చెల్లించడమేంటో అర్థం కావడం లేదు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగిస్తే ప్రభుత్వానికి జీఎస్‌డీపీలో 0.5 శాతం రుణాన్ని అదనంగా పొందే వెసులుబాటు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టాలని మాత్రమే చెప్పగా.. దానికి జోడింపుగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌మీటర్ల పేరుతో భారీ వ్యయానికే సిద్ధపడింది. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం కింద మోటార్లకు అమర్చే ఒక్కో మీటరుకు కేంద్రం ఇచ్చేది 1,350 రూపాయలు మాత్రమే. ఒక్కో స్మార్ట్‌ మీటరుపై ప్రభుత్వం వెచ్చిస్తున్న 37 వేల రూపాయల్లో కేంద్రం వాటా 1,350 రూపాయలు పోనూ మిగతా భారం రాష్ట్ర ప్రజలే భరించాలి.

ఈ ప్రాజెక్టుకు కోసం ప్రభుత్వం తెచ్చే అప్పుల వల్ల.. ఆ భారం కూడా చివరికి రాష్ట్ర ప్రజలపైనే పడుతుంది. అయినా సరే ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ఈ కుంభకోణంపై భవిష్యత్తులో మరో పార్టీ ప్రభుత్వమేదైనా విచారణ జరిపిస్తే... దీనిలో భాగస్వాములైన నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ జైలుకు వెళ్లక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.