కోవిడ్-19 పరిణామాల తర్వాత అన్ని రంగాల్లో.. ఆలోచనల్లో మార్పు అనివార్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో యువతను భాగస్వామ్యం చేయాలన్నారు.
పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 నైపుణ్య శిక్షణా కళాశాలల ఏర్పాటుకు సన్నద్ధం కావాలన్నారు. 7 జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరిత గతిన ఆయా జిల్లాల్లో కళాశాలల ఏర్పాటుకు.. స్థల సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. 5 ఎకరాలకు తగ్గకుండా నైపుణ్య కళాశాలల నిర్మాణాల కోసం భూమిని సేకరించాలని అధికారులకు మంత్రి సూచించారు.
మూతపడ్డ పరిశ్రమలు, కోవిడ్- 19 కారణంగా సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలస కూలీల వివరాలతో పాటుగా..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతి, యువకుల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం