గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌లో ఏకంగా 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి ఆర్. కేశవరెడ్డి షోకాజు నోటీసులను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమూల్ పాలసేకరణ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వహించారని వారికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకుగాను ఏడురోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో సూచించారు.
గ్రామాల్లో రైతుల నుంచి పాలసేకరణ విషయంలో పంచాయతీలకు కార్యదర్శులే నోడల్ అధికారులు. అమూల్‌కు పాలు పోసేలా ప్రజలను చైతన్య పరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన కార్యదర్శులకు ఇటీవల షోకాజు జారీ చేశారు.
ఇదీ చదవండి: BJP MP GVL: వైకాపా ప్రభుత్వంపై అందరికీ నమ్మకం పోయింది: జీవీఎల్