లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గుంటూరు జిల్లా మంగళగిరి శివాలయం ఈవో నారాయణను కలెక్టర్ సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం బయటి వ్యక్తుల కోసం ఆలయంలో ప్రధాన పూజారులు మహేష్, శ్యామసుందర శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారని స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫొటోలు తీసి పంపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని దేవాదాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా పూజా కార్యక్రమాల నిర్వహించినట్లు రుజువు కావడంతో... ఆలయ ఈవో జేవీ నారాయణను సస్పెండ్ చేశారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో మండెపూడి పానకాలరావుకు శివాలయం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: 'ఆత్మ నిర్భర భారత్' కోసం 15 సూత్రాల ప్రణాళిక