ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​లో సేవలు విస్తృతం - మంగళగిరి ఎయిమ్స్​లో సేవలు విస్తృతం

కార్పొరేట్‌ తరహా వైద్యసేవలను అతి తక్కువ ధరలకే అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ సేవల పరిధి... మరింత విస్తృతం కానుంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఔట్‌ పేషెంట్‌ విభాగం నూతన భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో అందుతున్న సేవలపై అక్కడికొస్తున్న రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి ఎయిమ్స్​లో సేవలు విస్తృతం
మంగళగిరి ఎయిమ్స్​లో సేవలు విస్తృతం
author img

By

Published : Dec 9, 2019, 4:15 AM IST

మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ ఏడాది మార్చిలో తాత్కాలిక భవనంలో ఔట్‌ పేషెంట్‌ విభాగం ప్రారంభమవగా... ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 12 విభాగాల్లో రోజుకు సుమారు 300 మంది వైద్యసేవలు పొందుతున్నారు. నేటి నుంచి నూతన భవనంలో ఆధునిక సౌకర్యాలతో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. 5 అంతస్తుల్లో ఉండనున్న ఈ నూతన భవనం ద్వారా... మరింత విస్తృత సేవలందించేందుకు వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

"12 క్లినికల్‌, 4 డయాగ్నస్టిక్స్‌ విభాగాలు కలుపుకొని ఈ నూతన భవనంలో మొత్తం 16 విభాగాల్లో సేవలందిస్తాం. ఈ భవనం విశాలంగా ఉంటుంది. అందువల్ల సేవలను మరింత విస్తృతం చేస్తాం. అల్ట్రా సోనోగ్రఫీ, కలర్‌ డోప్లర్‌ వంటి సేవలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మెరుగైన ఈ తరహా వైద్యసేవలన్నీ తక్కువ ధరకే అందిస్తాం."
- రాకేష్‌ కక్కర్‌, ఎయిమ్స్‌ సూపరింటెండెంట్

మంగళగిరి ఎయిమ్స్​లో సేవలు విస్తృతం

ఈఎన్​టీ సహా అన్ని విభాగాల్లో అత్యాధునిక పరికరాలతోనే వైద్యసేవలు అందిస్తున్నామని ఎయిమ్స్‌ సిబ్బంది చెబుతున్నారు. వైద్యసేవలతో పాటు ఎయిమ్స్‌ ఆవరణలో ఉన్న అమృత్‌ కేంద్రం ద్వారా రాయితీపై రోగులకు మందులు అందిస్తున్నారు.

బయట ఆసుపత్రులతో పోలిస్తే ఎయిమ్స్‌లో సేవలు చాలా బాగున్నాయని... అవి కూడా తక్కువ ధరకే అందిస్తుండటం ఆనందంగా ఉందని రోగులు అంటున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో వచ్చే ఏడాది మే నుంచి ఆయుష్‌ బ్లాక్‌, అక్టోబర్‌ నుంచి ఇన్‌పేషెంట్ విభాగం ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇదీచదవండి

కార్యకర్తల్లో క్రమశిక్షణ ఉండుంటే...జనసేన గెలిచేది: పవన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.