ETV Bharat / state

ప్రభుత్వం గొప్పలు.. ఆర్‌బీకేల్లో తప్పని తిప్పలు.. విజిలెన్స్‌ తనిఖీల్లో నిజాలు

Rythu Bharosa Center in AP: రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) ఓ అద్భుతమని, విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్నీ అక్కడే అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఘనంగా ఉన్నా..సేవలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. సగటున ఒక్కోఆర్‌బీకేలో ఏడాదిలో 700 బస్తాల ఎరువులూ అమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేసే ప్రచారంలో పదో వంతు సేవలైనా క్షేత్ర స్థాయిలో రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రం-ఆర్‌బీకే ల సేవలపై ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్భాటం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

రైతు భరోసా కేంద్రం
Rythu Bharosa Center
author img

By

Published : Oct 23, 2022, 7:26 PM IST

రైతు భరోసా కేంద్రాలు

Rythu Bharosa Center: ఆర్‌బీకేల్లో అన్ని ఎరువులూ దొరకవు. విత్తనాలు, పురుగు మందుల తదితరాలకు డబ్బు చెల్లించి బుక్‌ చేసుకోవాలి. అందుకే నామమాత్ర అమ్మకాలే సాగుతున్నాయి. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 678కోట్ల 38లక్షల విలువైన 6లక్షల 27వేల టన్నుల ఎరువులు విక్రయించారు. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కోసం స్థానిక రైతు భరోసా కేంద్రానికి వెళ్లగా.. యూరియా తప్ప ఎలాంటి ఎరువులు లేవని తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బీ.ఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని రైతులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.

రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటైన నాటి నుంచి అంటే 2020 ఖరీఫ్‌ నుంచి 2022 ఏప్రిల్‌ వరకు చూస్తే 1.36 లక్షల లీటర్ల పురుగు మందులు విక్రయించారు. రైతులు ఏదైనా పురుగు మందు అవసరమై ఆర్‌బీకేకు వెళ్తే డబ్బు చెల్లించి బుక్‌ చేసుకుంటే తెప్పించి ఇస్తామంటున్నారు. అదెప్పటికి వస్తుందో తెలియదు. ఫలితంగా పురుగుమందుల అమ్మకాలు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలోని 10వేల 778 రైతు భరోసా కేంద్రాల్లో 2021-22లో సగటున..700 బస్తాలలోపే ఎరువులు అమ్మారు. 2020-21, 21-22లో సగటున 12.62 లీటర్ల పురుగుమందులు విత్తనాలు, సగటున 13.60 కిలోల విత్తనాలు మాత్రమే విక్రయించారు.

రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 10వేల,778 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు సేవలందించాలి. అయితే 1,600 పైగా ఉద్యాన సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ కారణాలతో రాజీనామా చేసిన వారు, సెలవు పెట్టిన వారిని కూడా కలిపితే 4,500 వరకు ఆర్‌బీకేల్లో ఇన్‌ఛార్జుల సేవలే అందుతున్నాయని చెబుతున్నారు. కొందరు రెండు మూడు ఆర్‌బీకే ల పరిధిలో సేవలందించాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలో 64 మంది వ్యవసాయ సహాయకుల పోస్టులుండగా.. ప్రస్తుతం 25 మంది మాత్రమే ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలో ఐదింటిలో ఒక కేంద్రానికే మాత్రమే వ్యవసాయ సహాయకులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 500 పైగా పశుసంవర్ధకశాఖ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండటంతో.. గోపాలమిత్రలకు విధులు అప్పగించారు.

రాష్ట్రంలో మొత్తం 10వేల 369 RBKలు నిర్మించాలని నిర్ణయించగా,ఇప్పటికి 3వేల302 మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో 1,700 మాత్రమే అప్పగించారు. కొన్ని పాత ప్రభుత్వ భవనాల్లో, మరి కొన్ని అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. వీటికి 6 నెలల నుంచి ఏడాదిన్నరకుపైగా అద్దెబకాయిలు ఉన్నాయి. వీటికి 30 కోట్ల రూపాయలకు పైనే చెల్లించాల్సి ఉంది. అద్దెలు ఇవ్వకపోవడం వల్ల ఇంటి యజమానులు తాళాలేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మొత్తం 1,080ఆర్‌బీకే లు ఉండగా.. 596 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 5కోట్ల 50లక్షల అద్దె బకాయిలున్నాయి. విద్యుత్తు బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది.

రైతు భరోసా కేంద్రాల్లో టీవీలున్నా, 50% పైగా వినియోగించడం లేదు. కొన్ని చోట్ల విద్యుత్తు సౌకర్యం అందుబాటులో లేక మూలన పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గుత్తులపుట్టు వద్ద కొత్తగా నిర్మించిన ఆర్‌బీకే కేంద్రానికి విద్యుత్తు లేక ఆన్‌లైన్‌ నమోదు చేసే కియోస్క్, ఎల్‌ఈడీ టీవీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. యూట్యూబ్‌లో రైతు భరోసా ఛానెల్‌ చూస్తే మొత్తం సమాచారం తెలుస్తుందని కొందరు వ్యవసాయ సహాయకులు రైతులకు చెబుతున్నారు. ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేసిన కియోస్క్‌లపై రైతులకు అవగాహన లేదు. కొన్ని వినియోగం లేక తుప్పు పడుతున్నాయి.

వ్యవసాయ, ఉద్యాన సహాయకులు పొలాల్లో తిరిగి.. రైతుల సమస్యలు తెలుసుకోవాలి. వీటిని ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సూచించాలి. అయితే ఆ పనులన్నీ పక్కన పెట్టి ఎరువులు, పురుగుమందుల అమ్మకం, రోజుకు నాలుగు యాప్‌లు పూర్తి చేయమని చెప్పడంతో.. ఈ-క్రాప్, పంటనష్టం నమోదుకు తప్పితే పొలాల్లోకి రావడమే కష్టంగా ఉందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి విస్తరణ సేవలకే పరిమితం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.