గుంటూరు రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన రావిపాటి బసవ సుందరరావు అనే వ్యక్తిని.... రాపర్ల వెంకటేశ్వరరావు, పొన్నం పద్మ శ్రీనివాసరావు అనే ఇద్దరు.. వ్యాపారంలో భాగస్వామ్యులుగా ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు. ఈ మానసిక క్షోభను భరించలేక.. పురుగుల మందు తాగిన బసవ సుందరరావు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించాడు.
తన ఆత్మహత్యకు వ్యాపార భాగస్వాములే కారణమని అంతకుముందో సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పట్టాభిపురం పోలీసులు... నిందితులు రాపర్ల వెంకటేశ్వర్లు, పొన్నం పద్మ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: