గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో రొంపిచర్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. రూ.40వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి