సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులతో ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరులో తెలుగు యువత నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా 3 నెలలు నుంచి నిరసన చేస్తున్నా అధికారులు స్పదించటం లేదని తెలుగు యువత రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బ్రహ్మం మండిపడ్డారు.
సర్టిఫికెట్ పరిశీలిన అయిపోయినా ఇప్పటివరకు ఉద్యగాలు ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఇకనైనా సంబంధిత మంత్రులు స్పదించి అభ్యర్ధల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామన్నారు. ఈ నెల 31న విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి