వ్యాక్సిన్ల కోసం గుంటూరు జిల్లాలో ప్రజలు ఆందోళన చెందుతుండగా.. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు రెండ్రోజులపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వాయిదా వేశారు. ఇప్పటికే రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. రెండు రోజులు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వాయిదా విషయం క్షేత్రస్థాయి వరకు చేరకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
శని ఆదివారాల్లో నిలిపివేత..
డేటా బేస్ సమస్యలతో పాటు మరికొన్ని సాంకేతికత సమస్యల కారణంగా శని, ఆదివారం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను నిలిపివేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ పేర్కొన్నారు. సోమవారం నుంచి యథావిధిగా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఓ తల్లికి బిడ్డే కదా..!