ETV Bharat / state

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం

గుంటూరు రూరల్ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని.. ఎస్పీ విశాల్ గున్నీ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ వారాన్ని స్పెషల్ డ్రైవ్ ఎన్​ఫోర్స్​మెంట్​ వారంగా ప్రకటించి.. ప్రత్యేక దాడులు నిర్వహించాలని సూచించారు.

Special Enforcement Bureau
ఎస్పీ విశాల్ గున్ని
author img

By

Published : Mar 17, 2021, 8:06 PM IST

గుంటూరు జిల్లాలో ఎస్​ఈబీ అధికారులు తలపెట్టిన స్పెషల్ డ్రైవ్ ఎన్​ఫోర్స్​మెంట్​ వీక్​లో భాగంగా.. సోమ, మంగళ వారాల్లో గుట్కా, ఖైనీ వంటి నిషేధిత పదార్థాలు తయారీ, సరఫరా, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశించారు. బుధ, గురువారాల్లో పేకాట, కోడి పందాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని.. శిబిరాలపై దాడులు నిర్వహించాలన్నారు. శుక్ర, శని వారాల్లో ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలపై దృష్టి సారించాలని పోలీస్ అధికారులకు తెలిపారు.

ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అధికారి, స్థానిక ఎస్ఈబీ అధికారుల సమన్వయంతో తమ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న నేరుగా తన ఫోన్ నంబర్​కి గానీ, రూరల్ జిల్లా వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 88662 68899కి లేకుంటే డయల్ 100కి సమాచారం ఇవ్వాలన్నారు.

ఇవీ చూడండి...

క్వారీ నుంచి ఇసుక రవాణా.. అడ్డుకున్న ముఠా కూలీలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.